24 గంటల్లోనే బాలుడి అపహరణ కేసును ఛేదించిన నిజామాబాద్ పోలీసులు
– బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగింత
నిజామాబాద్ :నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని మాతా శిశు సంరక్షణ కేంద్రం నుండి సుమారు రెండున్నర సంవత్సరాల వయస్సు గల బాలుడు వేదాంష్ను ఇద్దరు వ్యక్తులు మాయమాటలు చెప్పి అపహరించిన సంఘటన జరిగింది. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పోలీస్ కమిషనర్, నిజామాబాద్ ఆదేశాలు మరియు పర్యవేక్షణలో బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వెంటనే విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో టౌన్-I పోలీస్, CCS, క్రైమ్ మరియు టెక్నికల్ టీమ్స్ సమన్వయంతో పనిచేశాయి. వివిధ ప్రాంతాల్లోని CCTV కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడం, సాంకేతిక ఆధారాలను విశ్లేషించడం, అనుమానితుల కదలికలను గుర్తించడం వంటి చర్యలను నిరంతరం చేపట్టారు. పోలీస్ బృందాలు రాత్రింబవళ్లు నిరంతరంగా నిర్వహించిన గాలింపు మరియు దర్యాప్తు చర్యల ఫలితంగా, కేవలం 24 గంటల్లోనే సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ గ్రామంలో బాలుడు వేదాంష్ ఆచూకీని గుర్తించి, అతనిని సురక్షితంగా రక్షించడం జరిగింది. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన: A1. కోతాడి సుజాత, W/o యెల్లం, వయస్సు 30 సంవత్సరాలు, నిజాంపేట్ గ్రామం, మెదక్ జిల్లా, ప్రస్తుతం మేడ్చల్‌లో నివాసం. A2. కోతాడి యెల్లం, S/o పోచయ్య, వయస్సు 38 సంవత్సరాలు, నిజాంపేట్ గ్రామం, మెదక్ జిల్లా, ప్రస్తుతం మేడ్చల్‌లో నివాసం. అనే ఇద్దరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది.రక్షించిన బాలుడు వేదాంష్, వయస్సు 2½ సంవత్సరాలు,కు అవసరమైన వైద్యపరీక్షలు మరియు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం ఈరోజు అతని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడం జరుగుతుంది. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించి బాలుడిని సురక్షితంగా రక్షించడంలో టౌన్-I, CCS, క్రైమ్, సివిల్ మరియు టెక్నికల్ టీమ్స్ సమన్వయంతో చేసిన కృషి, అలాగే సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారం ఎంతో కీలకంగా నిలిచింది. బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు కృషి చేసిన అధికారులు మరియు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


