అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు

అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు

“చలో అసెంబ్లీ”ని అడ్డుకునేందుకు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం
ప్రజా సమస్యలపై మా పోరాటం ఆగదు: బీజేపీ నాయకులు

రామచంద్రపురం,: ప్రజా సమస్యలపై బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తనను రామచంద్రాపూర్‌లోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీజేపీ నాయకుడు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపు మేరకు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనకుండా తనను అక్రమంగా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతును అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని అడ్డుకోలేరని, ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తల సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డివిజన్ అధ్యక్షుడు నాదరెడ్డి, జిల్లా స్పోర్ట్స్ కన్వీనర్ కృష్ణమూర్తి, డివిజన్ ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్, జి. మలేష్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ  పిలుపు...
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు