ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలి

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలి

డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ శంషుద్దీన్

నాగర్ కర్నూల్: వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బిజినపల్లి ఎస్ఐ శంషుద్దీన్ కోరారు. చెరువులు, కుంటల వద్దకు వృద్ధులు, చిన్న పిల్లలు వెళ్లరాదని, అలాగే డీజేల వద్దకు కూడా వెళ్లరాదని హెచ్చరించారు. నిమజ్జన వేడుకల్లో ఎవరైనా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డీజేల శబ్దాల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మండప నిర్వాహకులు గణనాథుని నిమజ్జనం చేసే క్రమంలో మద్యపానానికి దూరంగా ఉండాలని, ఊరేగింపు సమయంలో విద్యుత్ శాఖ వారితో సమన్వయం పాటించి కరెంటు వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

Views: 130

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.