బాన్సువాడ కు హెడ్ పోస్ట్ ఆఫీస్ మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కి వినతి పత్రం.
- కేంద్ర మంత్రి ని మర్యాదపూర్వకం గా కలిసిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్.
- సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి..
బాన్సువాడ మున్సిపాలిటీ లో హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని శనివారం బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దీంతో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ మంత్రి పెమ్మసాని నీ మర్యాద పూర్వకంగా కలిసి మంత్రి కోరడం తో సానుకూలం గా స్పందించినట్లు ఎన్నారై తెలిపారు. బాన్సువాడ కు త్వరలో నే హెడ్ పోస్ట్ ఆఫీస్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చినట్లు అన్నారు. వెంటనే సానుకూలం గా స్పందించి న కేంద్ర మంత్రి కి ఆయన బాన్సువాడ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


