టెన్షన్.. ఫామ్‌హౌస్‌కు కేటీఆర్, హరీష్‌రావు

టెన్షన్.. ఫామ్‌హౌస్‌కు కేటీఆర్, హరీష్‌రావు

సంగారెడ్డి డెస్క్,  :కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో సిద్ధిపేట జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దామరకుంట వద్ద ఫామ్‌హౌస్ వైపు తరలివస్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల వాహనాలపై రాళ్లు విసిరినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు అసెంబ్లీ నుంచి నేరుగా ఫామ్‌హౌస్‌కు బయలుదేరి వెళ్లారు. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

WhatsApp Image 2026-09-08 at 1.30.29 PM (1)

Views: 28

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News