ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
- హాల్ టికెట్లు సర్టిఫికెట్లు నిలిపిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి
- ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా
అక్కన్నపేట : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారత కేంద్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కా. పోలవేణి నరేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు ఇప్పటి వరకు విద్యార్థుల ఖాతాల్లో జమ కాకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేదని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని, పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వకుండా, సర్టిఫికెట్లు నిలిపివేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేయకపోతే, CSFI ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
డిమాండ్లు:
1. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి.
2. విద్యార్థులను వేధిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి.
3. ప్రతి విద్యా సంవత్సరం సకాలంలో స్కాలర్ షిప్ లు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


