లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు

లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు

సనత్ నగర్ డివిజన్ లోధా కెసా పారడైజో అపార్ట్మెంట్‌లో కొలువైన గణనాధునికి అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో సనత్‌నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కొలను బాల్ రెడ్డి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపయ్యకు పుష్పాలంకరణ చేసి, ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అపార్ట్మెంట్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణనాధుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కొలను బాల్ రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేలకమంది మందికి పైగా పాల్గొన్నారు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ వేడుకలలో అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట సుబ్రహ్మణ్య శర్మ మండలిక, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ వనపర్తి, సెక్రటరీ శ్రీధర్ రెడ్డి తోట, జాయింట్ సెక్రెటరీ అంకిత్ అగర్వాల్, ట్రెజరర్ శేష బాల సుబ్రహ్మణ్యం, జాయింట్ ట్రెజరర్ రమణ బాబు, టెంపుల్ చైర్మన్ సుధారాణి, మూర్తి, కామేష్ తదితరులు పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.