వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు
- ఘనంగా సామూహిక కుంకుమార్చన
- యువత దైవభక్తి సేవా గుణం కలిగి ఉండాలి
- మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి నర్సింగరావు
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 17వ వార్డులోని మస్కూరి వాడలో వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.శుక్రవారం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సి పల్ వైస్ చైర్పర్సన్ పద్మాభాయి నర్సింగరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు దైవభక్తి సేవగుణం కలిగి ఉండాలని యువత సన్మార్గంలో పయనించాలని, వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించి, ఆ ఆదిదేవుడు గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. కుంకు మార్చన కార్యక్రమంలో పాల్గొన్నమహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపతి విగ్రహ దాత నవీన్, వీఐపీ యూత్ సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


