పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి
ఆదిలాబాద్ డెస్క్,: కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సంఘటన్ సృజన్ అభియాన్”లో భాగంగా బోథ్ మండలంలోని 21 గ్రామాలకు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులను నియమించినట్లు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేరుగు భోజన్న తెలిపారు. ఈ సందర్భంగా మెరుగు భోజన్న మాట్లాడుతూ TPCC, DCC నాయకత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన ఈ నియామకాల ద్వారా గ్రామస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నూతన అధ్యక్షులు కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు గ్రామస్థాయి కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక. ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి కాంగ్రెస్‌ను ప్రజలకు మరింత చేరువ చేయడమే మా లక్ష్యం. నూతన అధ్యక్షులు బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అని అన్నారు నూతనంగా నియమితులైన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్,టీ పి సిసి సెల్ ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆశన్న, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా అధ్యక్షులు అంజయ్య, మండల అధికార ప్రతినిధి అచ్యుత్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కౌసర్, ప్రధాన కార్యదర్శి అబూద్, ఉమేష్ జాదవ్, తాజా మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ బ్లాక్ అధ్యక్షులు మేరుగు నరసింహాదాస్, సొసైటీ డైరెక్టర్ చాట్ల ఉమేష్, మాజీ ఎంపీటీసీ షేక్ తదితరులతో పాటు కాంగ్రెస్నాయకులు బొజ్జ సాయన్న,అలీం,జగన్,అబ్రార్, అమీరోదిన్ పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

