పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి:
జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
గ్రేటర్ వరంగల్ : గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు డివిజన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను, బిల్లుల చెల్లింపుల నిమిత్తం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ముందుగా 49వ డివిజన్‌లోని రెవెన్యూ కాలనీ, ప్రకాశరెడ్డిపేట ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాలువలను పరిశీలించారు. అనంతరం 22వ డివిజన్‌లోని పోచమ్మ మైదాన్, 21వ డివిజన్ ఎల్బీనగర్, 36వ డివిజన్‌లోని చింతల్, 38వ డివిజన్‌లోని ఖిలా వరంగల్ ప్రాంతాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి పైప్‌లైన్‌ల నిర్మాణ పనుల నాణ్యతను కమిషనర్ పరిశీలించారు. పోచమ్మ మైదాన్‌లో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను కూడా పరిశీలించి, నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, పనుల పూర్తికి ముందు అధికారులు క్షేత్రస్థాయిలో నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సంతోష్ బాబు, డీఈలు, ఏఈలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


