కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ దండు
ఎర్రవల్లికి వేలాదిగా శ్రేణులు
- డప్పుల మోతతో ఎర్రవల్లి వైపు కాంగ్రెస్ దూకుడు
- కేసీఆర్ డౌన్ డౌన్’ నినాదాలతో మార్మోగిన పరిసరాలు
- భారీగా మోహరించిన పోలీసులు.. కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న వైనం
సంగారెడ్డి డిస్క్ : సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు. డప్పుల మోతలు, నినాదాలతో ఎర్రవల్లి పరిసరాలు ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతతో మార్మోగుతున్నాయి. మర్కుక్ మండలం వరదరాజపూర్ గ్రామం వైపు నుంచి గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫామ్‌హౌస్ వైపు కదులుతున్నాయి. ‘కేసీఆర్ డౌన్ డౌన్’ అంటూ పోటెత్తిన నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు భారీగా మోహరించి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫామ్‌హౌస్ వైపు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


