గాంధీజీ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం 

గాంధీజీ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం 


నాంపల్లి: గురువుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుతూ శనివారం గాంధీజీ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు గురువులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ముందుగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమకు విద్యాబుద్ధులు నేర్పుతూ, మంచి మార్గంలో నడిపిస్తున్న ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి అంశాలను కూడా నేర్పుతున్నారని తెలిపారు.అనంతరం ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ  విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని పేర్కొన్నారు.విద్యార్థులు చూపిన అభిమానం, ఆత్మీయత తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ కర్నాటి నాగరాజు, సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సామల వెంకటేశం, చిలుకూరి రామేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ  పిలుపు...
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు