ఏం. పీ. అర్విoద్ కీలక బాధ్యతల పట్ల హర్షం : రాష్ట్ర నాయకులు.
బాల్కొండ : విదేశీ విరాళాలు మరియు సవరణల బిల్లు జెయింట్ యాక్షన్ కమిటీలో సభ్యునిగా కీలక బాధ్యతలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులైన ధర్మపురి అర్విoద్ ఎంపిక కావడం పట్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేషనల్ ప్రాజెక్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు అధ్యక్షులు విజయ్ కుమార్, ఉపాధ్యా క్షులు డా, పవన్ కుమార్, సెక్రటరీ జనరల్ బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు,నిజామాబాదు జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సంయుక్త కార్యదర్శి సత్వావె సంతోష్ కుమార్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. నిజామాబాదు పార్లమెంట్ సభ్యుడుగా ఎంపికైన స్వల్ప వ్యవదిలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులు చేయించడం తోపాటు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు చేయడం, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ రైల్వే మంత్రితో సంప్రదించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ఎంపీ అరవింద్ చేసిన కృషి అభినందనీయమని విజయ్, పవన్, నర్సింగ్ రావు హర్షం వ్యక్తం చేస్తూనే నిజామాబాదు పార్లమెంట్ సభ్యులైన ధర్మపురి అర్విoద్ ను విదేశీ విరాళాలు మరియు సవరణల బిల్లు జెయింట్ యాక్షన్ కమిటీలో సభ్యునిగా నియమించి నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


