కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి
హన్మకొండ: హన్మకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా ) కార్యాలయంలో శనివారం కుడా చైర్మన్ గా గుండు సుధారాణి ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గుండు సుధారాణి కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించే విధంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన మరియు పట్టణాభివృద్ధి పనులు వేగవంతం చేసే దిశగా కృషి చేయాలని కూడా చైర్మన్ గుండు సుధారాణి కి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ అలీ, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


