హైదరాబాద్‌ లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

హైదరాబాద్‌ లో 12 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్

హైదరాబాద్‌,: అర్హత లేకుండానే వైద్యులుగా చలామణి అవుతున్న 12 మంది నకిలీ డాక్టర్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ జోన్లలో ప్రత్యేకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగిస్తూ క్లినిక్‌లు ఏర్పాటు చేసి, ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే రోగులకు చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సెలైన్లు ఎక్కించడం, ఇంజక్షన్లు ఇవ్వడం, వివిధ రకాల మందులు అందించడం వంటి వైద్య సేవలను నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. దాడుల సందర్భంగా నకిలీ డాక్టర్ల క్లినిక్‌ల నుంచి భారీగా సెలైన్‌ బాటిళ్లు, మందులు, బీపీ పరీక్షించే పరికరాలు, సర్జికల్‌ కత్తెరలు తదితర వైద్య సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో ప్రజలను మోసం చేస్తూ వైద్యం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి వెనుక ఉన్న వ్యక్తులు, నకిలీ ధ్రువపత్రాల వ్యవహారంపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జిలుగుమాడులో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
మున్సిపాలిటీ పరిధిలోని జిలుగుమాడు గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ...
పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేసిన పూర్వ విద్యార్థి
ఎంక్వయిరీ లేకుండానే మెమోలు...
గురువారం గ్రామ, వార్డు సభలు
హైవేపై మృత్యుఘోష..
దర్యాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
మురుగు నీటితో దోమల బెడద.. పట్టించుకోని అధికారులు