కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ పోరాటం

నిజామాబాద్‌ లో గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ

కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ పోరాటం

నిజామాబాద్  : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో గణేష్ బిగాల గారు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిర్ణయాల వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిని, వారి పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం లేక నిత్యం తిండికి కూడా ఇబ్బందులు పడుతూ, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో సోదరులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నగరంలో పారిశుధ్య లోపాలపై బిఆర్ఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు. హైమది బజార్ లో నిర్మించిన నూత మార్కెట్ దుర్గంధం తో అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఇందులో భాగంగానే ఇప్పటికే మహిళల సమస్యలపై ధర్నా, బైక్ ర్యాలీలు నిర్వహించామని, నేడు ఆటో కార్మికులకు మద్దతుగా నేడు  ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నూతన ప్రభుత్వానికి ప్రజలు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వేచి చూశారని, కానీ 1000 రోజుల సమయం ఇచ్చినా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి పురోగతి లేదన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే నిజమైన తెలంగాణవాది కేసీఆర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఒక్కో ఆటో డ్రైవర్ కు రూ. 36,000 బాకీ పడిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ గారి హయాంలో ఆటోలు మరియు ఇతర రవాణా వాహనాలకు రోడ్డు టాక్స్ మినహాయింపు ఇచ్చారని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ నిబంధనలను పక్కనబెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఫ్రీ బస్సు పథకం తెచ్చి ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీశారని, దానికి పరిహారంగా ఇస్తామన్న సహాయాన్ని విస్మరించారని అన్నారు. కేవలం ఆటో కార్మికులే కాకుండా రైతులు, మహిళలు, యువతను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ గారు ఇచ్చే రూ. 2,000 పింఛన్ స్థానంలో రూ. 4,000 ఇస్తామని, ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి పథకాల్లో తులం బంగారం ఇస్తామని చెప్పి, ఇప్పుడు బంగారం ధరలు పెరిగాయనే నెపంతో పథకాన్ని పక్కనబెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్లలకు ఇస్తామన్న బైక్ ల హామీ కూడా నెరవేరలేదన్నారు. రాష్ట్రంలో ప్రజల తరఫున పోరాడే నిజమైన ప్రతిపక్షం, నిజమైన నాయకుడు కేసీఆర్ గారేనని స్పష్టం చేశారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గులాబీ సైన్యం నిరసన కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఆటో సోదరులకు, ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, త్వరలోనే కేసీఆర్ గారి దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్,చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
మిడ్జిల్: రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్...
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అక్రమ అరెస్టులతో మా గొంతు నొక్కలేరు