కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనకు వ్యతిరేకంగా బిచ్కుందలో బీఆర్ఎస్ భారీ నిరసన
బిచ్కుంద: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బిచ్కుందలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, విద్యార్థులు, యువకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. “ప్రజల, విద్యార్థుల,యువకుల, రైతుల ఉసురు తాకి పోతావురోయ్ రేవంతూ. అంటూ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే చేసిన నినాదాలు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువకు లు, రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపాయి. ఆయన ప్రసంగంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని బిచ్కుందలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


