మాజీ మేయర్ సంజయ్, ఎంపీ అరవింద్ పై తీవ్ర ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యల ఖండన
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత, అహంకారపూరిత వ్యాఖ్యలపై నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం లో రాజకీయం, విధానపరమైన అంశాలపై నిర్మాణాత్మక విమర్శలు చేయడాన్ని స్వాగతిస్తామని, అయితే ఒక ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని శరీర ఆకృతిపై వ్యాఖ్యలు (బాడీ షేమింగ్), వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ సంస్కృతిలోనే అత్యంత దిగజారుడు చర్య అని మండిపడ్డారు. సదరు పార్లమెంట్ సభ్యుడి సంస్కారాన్ని, నైతికతను ప్రశ్నించిన సంజయ్, బీజేపీ నాయకులు ఇలాంటి భాషను సమర్థిస్తున్నారా అని నిలదీశారు. వ్యక్తిగత దాడులే వారి ముఖ్యమైన సిద్ధాంతమా అని ప్రశ్నించారు. నిజామాబాద్ అభివృద్ధిని విస్మరించి, ఓటర్లను మోసం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజాదరణను చూసి భయంతోనే అరవింద్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు ఎంపీ అరవింద్ వెంటనే నిరభ్యంతరంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు దిగితే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని సంజయ్ హెచ్చరించారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Aug 2026 17:42:08
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆర్‌అండ్ బీ అతిథి గృహంలో ఫోరం జిల్లా అధ్యక్షులు మునిపల్లి సాయిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...
