కాలనీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- పలు కాలనీల్లో పర్యటించిన మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
- NRP కాలనీలో రూ.2.50 కోట్ల సీసీ రోడ్లకు స్థల పరిశీలన
పటాన్‌చెరు,: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సోమవారం పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా NRP కాలనీలో మంజూరైన నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదిత ప్రాంతాలను కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.2.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. కాలనీలో అవసరమైన మిగిలిన అభివృద్ధి పనులకు కూడా నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం జేపీ కాలనీలో వినాయక మండపం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని ఆయన పరిశీలించారు. మండపం ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో పిచ్చి మొక్కలు, మట్టి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో వాటిని తొలగించాలని స్థానికులు కోరారు. స్పందించిన మెట్టు కుమార్ యాదవ్ వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందితో మాట్లాడి అక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టించారు. కాలనీల్లో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం కృషి చేస్తామని మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొం టున్నసమస్యలను సంబంధిత అధికారులదృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


