ఎమ్మెల్సీ తాతా మధు తీన్మార్ ఖాన్ ఏం కాదు.

ఎమ్మెల్సీ తాతా మధు తీన్మార్ ఖాన్ ఏం కాదు.

  • వంటావార్పు పేరుతో..కాంగ్రెస్పై ఆరోపణలు  అర్థరహితం
  • అభివృద్ధిని చూడలేక బిఆర్ఎస్ వాళ్లకి  కండ్లమంట
  • విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

కారేపల్లి(ఖమ్మం) బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ తాతా మధు తీన్మార్ ఖాన్ ఏం కాదని,కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూడలేక..బిఆర్ఎస్ పార్టీ వాళ్లకి కండ్లమంట ఎక్కువైందని,కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు అర్థరహితమని..దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు హెచ్చరించారు. శనివారం కారేపల్లి వైఎస్సార్ గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారేపల్లి క్రాస్ రోడ్డులో బిఆర్ఎస్ పార్టీ వంటావార్పు పేరుతో సభ ఏర్పాటు చేసి, 'కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు' అంటూ..అబద్ధాలు వల్లే వేస్తూసీఎం రేవంత్ రెడ్డిని,  ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులను ఇష్టానుసారంగా దూషించటం సరైన పద్ధతి కాదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు సంతోషంగా ఉన్నారని,  టిఆర్ఎస్ పార్టీ వాళ్లు పని కట్టుకొని ఒకే ఊరు నుంచి కూలికి వెళ్లే  మహిళలను బలవంతంగా  తీసుకువచ్చి సభలో కూర్చోబెట్టి కాంగ్రెస్పై దూషణకు దిగారు అన్నారు.  కారేపల్లి మండలంలో రూ.300 కోట్ల అభివృద్ధి జరిగిందని, పంచాయతీరాజ్ నిధుల నుంచి 230 సీసీ రోడ్లు , అంగన్వాడి భవనాలు,గ్రామపంచాయతీ భవనాలు వంటి అభివృద్ధి పనులకు గాను, రూ. 24.50 కోట్లు, 2,400 రేషన్ కార్డులు,గాంధీనగర్లో పీహెచ్సీ భవన నిర్మాణానికి రూ .2 కోట్లు నిధుల మంజూరు,  మాదారంలో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు,గుట్ట కింద గుంపులో రూ .9 కోట్ల నిధులతో  గోదాం నిర్మాణం,  500 ఇందిరమ్మ ఇండ్లు,ఈ ఏడాది మండలంలో రైతుల వద్ద నుంచి 50 వేల క్వింటాళ్ల మొక్కజొన్న పంటను ప్రభుత్వ మద్దతు ధర రూ. 2400 కొనటం,  ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక్క కారేపల్లి మండలంలోనే వందల కోట్ల అభివృద్ధి జరిగిందని,ఇవేమీ టిఆర్ఎస్ నాయకులకు కండ్లకు కనిపించకపోవడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉందని,మరి టిఆర్ఎస్ పార్టీ వాళ్లు సిద్ధమా అని వారు సవాల్ విసిరారు. ఇప్పటికైనా కండ్లమంట తగ్గించుకొని,కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులకు సహకరించాలని వారు కోరారు.ఎమ్మెల్సీ తాతా మధు చేసిన  దూషణ వెనక్కి తీసుకోవాలని,బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్,సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడ్డగోడ ఐలయ్య,సింగరేణి సర్పంచ్ మేదరి (టోనీ) ప్రతాప్,  భాగ్యనగర్ సర్పంచ్ బానోత్ హీరాలాల్,మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్, సురపు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,బోళ్ల రమేష్,ఎండి అనీఫ్,ఆదర్ల రాములు,సర్పంచ్ మోతీ వీరస్వామి,వాంకుడోత్ గాంధీ,తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 113

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ  పిలుపు...
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు