22A భూముల మహాధర్నాకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు.
కామరెడ్డి జిల్లా బాన్సువాడ : 22A నిషేధిత భూముల జాబితా ను రద్దు చేయాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు ప్రభుత్వాన్ని శనివారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద 22A నిషేధిత భూముల జాబితాకు వ్యతిరేకం గా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న బీజేపీ మహాధర్నా కు మద్దతు గా మండల కేంద్రం నుండి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ గా తరలి వెళ్లారు. ఈ సందర్భం గా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంద ని మండిపడ్డారు. ఎలాంటి నోటీసు లు ఇవ్వకుండా నే పేద, మధ్యతరగతి ప్రజల ప్రైవేట్ పట్టా భూములను, ఇళ్లను 22A నిషేధిత జాబితా లో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల ప్రజలు అత్యవసర సమయాల్లో భూములు అమ్ముకోలేక, బ్యాంక్ లోన్లు రాక విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ధరణి పోర్టల్ కంటే ఇప్పుడు తెచ్చిన ‘భూ భారతి’ ద్వారా ప్రజల భూముల పై మరిన్ని వివాదాలు సృష్టిస్తూ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. ఈ సమస్య పై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వం లో ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న రెండు రోజుల మహాదీక్ష కు తమ మండల కమిటీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 22A జాబితాను రద్దు చేయాలని, భూ అక్రమాల పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షం లో ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చందూరి హన్మండ్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మండల బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఓబీసీ మండల అధ్యక్షులు సాయిలు శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జ్ నాగరాజు, రవికాంత్, నందు, సాయితేజ, కార్తీక్,బూత్ అధ్యక్షులు పెద్ద సంఖ్య లో కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


