రోడ్లపై పశువులను వదిలితే చర్యలు

రోడ్లపై పశువులను వదిలితే చర్యలు

కొత్తగూడెం : పట్టణంలోని జాతీయ రహదారులతో పాటు ప్రధాన రోడ్లపై ఆవులు, గేదెలను విచ్చలవిడిగా వదిలేస్తున్న పశువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. రోడ్లపై పగలు, రాత్రి పశువులు సంచరించడం వల్ల వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో పశువులు సైతం గాయపడుతున్నాయని అధికారులు తెలిపారు. పశువులను ఇంటి ఆవరణలో లేదా పొలం వద్ద కట్టివేసి పెంచుకోవాలని యజమానులకు ఇప్పటికే పలుమార్లు నోటీసుల ద్వారా సూచించినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఇకపై రోడ్లపై సంచరించే పశువులను గోశాలకు తరలించడంతో పాటు, వాటి యజమానులపై మున్సిపల్ చట్టం–2019, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలకు పశువుల యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు, వాహనదారుల భద్రత దృష్ట్యా పశువుల యజమానులు సహకరించాలని కోరారు.

Views: 66

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్ పేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
పెద్ద శంకరంపేట్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఫీజుల బకాయి బిజెపి లడాయి పేరుతో బిజెపి రాష్ట్ర నాయకత్వం సోమవారం చలో అసెంబ్లీ  పిలుపు...
ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయాలి
బీజేపీ, బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం
చిలుకూరు లక్ష్మీ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం 
పినపాకలో వైద్యం గాల్లో
జాతీయ రహదారి కి ఇరువైపులా పార్కింగ్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు