బిజేపి మహాదీక్షకు తరలివెళ్లిన మండల నాయకులు

బిజేపి మహాదీక్షకు తరలివెళ్లిన మండల నాయకులు

సారంగాపూర్ : ​హైదరాబాద్ ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్ వద్ద బిజేపి అధిష్ఠానం పిలుపు మేరకు చేపడుతున్న "మహాదీక్ష" కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల బిజేపి నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరి వెళ్లారు. ​ ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి, 22A నిబంధనల వల్ల వేలాది ఎకరాల భూములు నిషేధిత జాబితాలోకి చేరాయని, దీనిపై స్పష్టత నివ్వాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. ​ ఈ భూ వివాదాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు కోసం 'హౌస్ కమిటీ' ని ఏర్పాటు చేయాలని బిజేపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ​ సెప్టెంబర్ 5, 6 తేదీల్లో తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బిజేపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిల నాయకత్వంలో ఈ మహాదీక్ష కొనసాగనుంది. ​ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు కాల్వ నరేష్, ముఖ్య నేతలు, మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని హైదరాబాద్ బాట పట్టారు.

Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వినియోగదారుల చైతన్య సదస్సు వినియోగదారుల చైతన్య సదస్సు
హన్మకొండ న్యూస్ :  విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్...
జీవో 97 రద్దు చేయాల్సిందే పాలిటెక్నిక్‌ విద్యార్థుల డిమాండ్‌
22A భూముల మహాధర్నాకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు.
వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి
బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
ఆదిలాబాద్ మున్సిపాల్టీ కి మంజూరైన నాలుగు ట్రాక్టర్లను
కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి