ములుగులో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు.
ములుగు : ములుగు మున్సిపాలిటీ పరిధిలోని యాదవ కాలనీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. 18వ వార్డు కౌన్సిలర్ బైకాని అనూష సాగర్, మాజీ ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాదం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. సమాజంలో వ్యక్తులు పతనం కాకుండా కాపాడేది ధర్మమే. ఎన్ని విపత్తులు ఎదురైనా ధర్మానికి కట్టుబడి ఉండటం వల్లనే రాముడు లోకాభిరాముడయ్యాడు. ధర్మాన్ని నశింపజేయాలని చూస్తే ఆ వ్యక్తితో పాటు వ్యవస్థ కూడా నాశనమవుతుంది" అని అన్నారు.మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలకపాత్ర పోషిస్తాయని,పండుగల ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రతి ఒక్కరూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం యువకులు ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు చిన్ని కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. వేషధారణలో పాల్గొన్న చిన్నారులకు బాదం ప్రవీణ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు గొర్రె అంకుస్, మాదం సాగర్, బైకాని విష్ణు, బైకాని క్రాంతి, బోయిని ఓం ప్రకాష్, గజ్జి రాజ్ కుమార్, కొడారి దిలీప్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


