అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అరెస్ట్
నల్ల షర్ట్ ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసుల అభ్యంతరం
పటాన్చెరు, : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ను అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నల్ల షర్ట్ ధరించి అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తున్న తనను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పాశవికంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటి? ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ ఎమ్మెల్యే జిఎంఆర్ పోలీసులను ప్రశ్నించారు.అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


