వినియోగదారుల చైతన్య సదస్సు

వినియోగదారుల చైతన్య సదస్సు

హన్మకొండ న్యూస్ :  విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. సెప్టెంబర్ 6 విసిఏ (వాలంటరీ కన్స్యూమర్ అక్టీవిస్ట్స్) అండ్ పీసీఏ (ప్రొఫెషనల్ కన్స్యూమర్ అడ్వైజర్స్) డే పురస్కరించుకుని హన్మకొండలోని రాంనగర్ లో జిల్లా వినియోగదా రుల సలహా సంఘం ఏర్పాటు చేసిన వినియోగదారుల చైతన్య సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు సమాజంలో ఉన్న అసమానతలు, పేదరికం, రైతుల ఆత్మహత్యలు, మూఢనమ్మకాల వలన జరిగే నష్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుందని, కాలేజీ విద్య పూర్తయిన తర్వాత తప్పనిసరిగా స్వచ్ఛంద సంస్థల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సమాజం పై వారికి ఒక మంచి అభిప్రాయం కలిగే  అవకాశం ఉంటుందని, సేవ చేయాలనే దృక్పథం ఏర్పడుతుందని అన్నారు. వినియోగదారుల సంఘాలలో విద్యార్థులు పనిచేయడం ద్వారా వ్యాపార సంస్థలు చేస్తున్న మోసాలు, తూనికలు, కొలతలు, కల్తీ ఆహార పదార్థాలు, సేవా రంగాలలో  జరుగుతున్న లోపాల గురించి చట్టపరంగా నష్టపోయిన వారికి సహాయం చేసేటువంటి అవకాశాలు తెలుసుకోగలుగుతారని అన్నారు. సామాజిక సేవా రంగంలో, వినియోగదారుల సంఘాల లో  పనిచేసిన వారికి భవిష్యత్తులో ఏ రంగంలోనైనా పనిచేయడానికి, ఆ రంగంలో రాణించడానికి వారికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ కే దామోదర్ మాట్లాడుతూ కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆధ్వర్యంలో భారతదేశమంతటా వీసిఏ (వాలంటరీ కన్స్యూమర్ అక్టీవిస్ట్స్)అండ్ (ప్రొఫెషనల్ కన్స్యూమర్ అడ్వైజర్స్) పిసిఏ డే నిర్వహించడం అభినందన అభినందనీయమని అన్నారు. వినియోగదారుల సంఘాల లో పనిచేస్తున్న వారికి ఇది ఎంతో ప్రోత్సహిస్తుందని, ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సలహా సంఘం సభ్యులు ఇందిరా, జ్యోత్స్నా, ప్రియాంక, మంజుల, హరిత, సుహాసిని పాల్గొన్నారు

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వినియోగదారుల చైతన్య సదస్సు వినియోగదారుల చైతన్య సదస్సు
హన్మకొండ న్యూస్ :  విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్...
జీవో 97 రద్దు చేయాల్సిందే పాలిటెక్నిక్‌ విద్యార్థుల డిమాండ్‌
22A భూముల మహాధర్నాకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు.
వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి
బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
ఆదిలాబాద్ మున్సిపాల్టీ కి మంజూరైన నాలుగు ట్రాక్టర్లను
కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి