డ్రైనేజీ కూల్చేశారు...
- ఇల్లు కడుతున్నారు!
- మాచిన్‌పల్లిలో అధికారుల మౌనం
దౌల్తాబాద్: ప్రజల మురుగునీటి పారుదల కోసం నిర్మించిన డ్రైనేజీని కూల్చివేసి, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నా అధికారు లు పట్టించుకోవడం లేదని మాచిన్‌పల్లి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కాలువను తొలగించడంతో మురుగునీటి పారుదల వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి వెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, డ్రైనేజీని సర్వే చేసి వాస్తవ పరిస్థితిని గుర్తించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


