కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన సంబరాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ సోయం బాపూరావు.
- మార్కెట్ కమిటీ చైర్మన్, డి సి సి అధ్యక్షుడు నరేశ్ జాదవ్..
- వేలాది బైక్ లతో భారీ ర్యాలీ*లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కి ముఖ్యఅతిధిగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్లే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డిలు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా పాలన సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తోందన్నారు. నిరుద్యోగులకు 70వేలకు పైగా ఉద్యోగాలు, అర్హులైన ప్రతి ఒక్కరి రేషన్ కార్డు లు, మహిళలు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రైతులకు రెండు లక్షల ఏక కాలంలో రుణమాఫీ, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. కానీ బీజేపీ, బి ఆర్ ఎస్ నాయకులు అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక ప్రజా ప్రభుత్వం పై మాట్లాడడం సిగ్గు చెటన్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, స్థానిక బీజేపీ ఎమ్మెల్లే పాయల్ శంకర్ గ్రామాల్లో సైతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో మరో సారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అలాగే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాహిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, అడి భోజ రెడ్డి, మల్లెపూల నరసయ్య, ఆడే గజేందర్,గండ్రత్ సుజాత, కిజార్ పాషా,గిమ్మ సంతోష్ రావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


