కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అంత డొల్ల
మందమర్రి, (మంచిర్యాల) : అడ్డగోలు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అంత డొల్ల నేనని,ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం క్యాతన్ పల్లి లోని బాల్క సుమన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొప్పుల ఈశ్వర్,బాల్క సుమన్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో చెన్నూరు ప్రాంత నిరుద్యోగుల కోసం ప్రకటించిన 45 వేల ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఎంత సేపు అధికారం,ఆస్తులను కాపాడుకోవడం కోసం కాకుండా చెన్నూరు ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఆరు గ్యారెంటీల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నాయకులు,కార్యకర్తల మీద కేసులు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో మేము తెచ్చిన నిధులను, పనులను చూపిస్తూ ప్రారంభించడం కాదు కొత్తగా నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలన్నారు. మంత్రి వివేక్,ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కేంద్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ వారం రోజుల పాటు బీఆర్ఎస్ అనేక పోరాటాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుమన్ చెప్పారు.
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగింది”
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని,కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అధ్యక్షతన మందమర్రిలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో కొప్పుల ఈశ్వర్ మాటాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు వారి సంక్షేమం, హక్కుల కొరకు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహించకుండా వాయిదా వేసే కుట్ర చేస్తుందని, కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు వస్తే కార్మికులందరూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


