వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి

వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం. వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని బాన్సువాడ పట్టణం లో మండలం లో ఏర్పాటు చేయనున్న వినాయక మండపాల నిర్వాహకులు, వివిధ మత పెద్దలు, పుర  ప్రముఖులు, వివిధ శాఖల అధికారుల తో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డిఎస్పి   పట్టణ సి.ఐ  అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భం గా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ. వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధల తో, శాంతియుత వాతావరణం లో నిర్వహించాలని సూచించారు. మండపాల ఏర్పాటు, ఊరేగింపులు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ప్రజల కు పోలీస్ శాఖ విజ్ఞప్తి:

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలందరూ శాంతి, సామరస్యాలను కాపాడుతూ పోలీస్ శాఖ కు సహకరించాల ని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వదంతుల ను నమ్మవద్దని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే లేదా అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయవద్దని సూచించారు. అనుమతులు లేకుండా వినాయక మండపాల ను ఏర్పాటు చేయ రాదని, నిర్ణీత సమయాలను పాటించాలని, ధ్వని కాలుష్య నిబంధనల ను గౌరవించాల ని తెలిపారు. ఊరేగింపు లు నిమజ్జన కార్యక్రమాల సమయం లో ప్రజలు పోలీస్ శాఖ సూచనల ను తప్పని సరిగా పాటిస్తూ సహకరించాల ని కోరారు. యువత బాధ్యతా యుతం గా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనల కు తావివ్వ కుండా చూడాలని, అనుమానాస్పద వ్యక్తు లు లేదా ఏదైనా సమస్య కనిపించిన వెంటనే పోలీసుల కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యం తో, పరస్పర గౌరవం తో వినాయక చవితి ఉత్సవాల ను ఘనం గా  శాంతియుతంగా నిర్వహించి బాన్సువాడ పట్టణ ప్రతిష్ఠను కాపాడాలని పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమావేశం లో పాల్గొన్న అన్ని కమ్యూనిటీ ల పెద్దలు వినాయక మండపాల నిర్వాహకు లు వినాయక చవితి ఉత్సవాలను శాంతి యుతంగా నిర్వహించేందు కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వినియోగదారుల చైతన్య సదస్సు వినియోగదారుల చైతన్య సదస్సు
హన్మకొండ న్యూస్ :  విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్...
జీవో 97 రద్దు చేయాల్సిందే పాలిటెక్నిక్‌ విద్యార్థుల డిమాండ్‌
22A భూముల మహాధర్నాకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు.
వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి
బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
ఆదిలాబాద్ మున్సిపాల్టీ కి మంజూరైన నాలుగు ట్రాక్టర్లను
కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి