విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

  • నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలి
  • గంభీరావుపేట కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ గరీమ అగ్రవాల్

గంభీరావుపేట, : విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, స్టోర్ రూమ్ పరిశీలించి, తరగతి గదులు, వసతి, తదితర అంశాలపై వివరాలు ఆరా తీశారు. సాధ్యమైనంత త్వరగా తరగతి గదుల నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి, గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. విద్యాలయంలో నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సందర్శనలో సర్పంచ్ మల్లుగారి పద్మ, పంచాయితీ రాజ్ ఈఈ సుదర్శన్ రెడ్డి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈ లు అన్వర్, సుమలత, ఎంపీడీఓ రాజేందర్, జీసీడీఓ పద్మజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Views: 43

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి జీవో నెంబర్ 97 రద్దుచేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి
హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన జీవో నంబర్ 97 ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ నగర కార్యదర్శి బత్తుల...
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం
నేత్రదానం చేయండి-చిరంజీవి గా జీవించండి
ప్రజా సంక్షేమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: TMRPS
విద్యార్థుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
లింగాపూర్ గ్రామ ఒక పెద్దయన ను కాదు ఒక తరాన్ని కోల్పోయినట్లు కాదు మగ్రే శంకర్
మొక్కల పెంపకంతో పచ్చని భవిష్యత్తుకు బాటలు