ఫీజు బకాయిల విడుదల కోసం రేపు చలో ఇందిరా పార్క్
ధర్నా విజయవంతం చేయాలి: -బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్: బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించనున్న చలో ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న మొత్తం ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ ఎప్పటికీ పోరాటం చేస్తుందని, ప్రభుత్వం సమస్యను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. రేపు నిర్వహించే ధర్నాకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా నిజాంసాగర్ కింది భాగంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని బీజేపీ రైతుల తరఫున డిమాండ్ చేసిందన్నారు. ఈ సమస్యపై జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ను కలిసి రైతుల సమస్యను వివరించడం జరిగిందన్నారు.అదే విదంగా మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది అన్నారు బీజేపీ విజ్ఞప్తికి స్పందించి నీరు విడుదల చేసినందుకు జిల్లా ఇంచార్జి కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కొంత మంది ఒక్క లెటర్ రాయకున్నా మేము చేశామని గొప్పలు చేప్పుకుంటున్నారని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నిజాంసాగర్ కింది భాగానికి నీరు విడుదల చేసినందున రేపు చేపట్టాల్సిన నిరాహార దీక్షను వాయిదా వేసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ రైతులకు సాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదురైతే రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కో కోశాధికారి ఆమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న రేపటి చలో ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం నిర్వహిస్తున్న ఈ పోరాటానికి జిల్లా నుంచి బీజేవైఎం నాయకులు, యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని కోరారు. విద్యార్థుల హక్కుల కోసం యువమోర్చా ముందుండి పోరాడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని ఆమంద్ విజయ్ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ,ST మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బిళోజి నాయక్,మోర్చా అధ్యక్షులు పురుషోత్తం,బీసీ మోర్చా అధ్యక్షులు బొబ్బిలి వేణు గోపాల్,కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి,కార్పొరేటర్లు బెల్లల్ శశాంక్,గిరిబాబు, అర్జున్ రెడ్డి, రాకేష్, రాజ్ గణేష్,ఆనంద్, ఆనంద్ రావు,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


