సన్న రకం వరి పండించే రైతులు విత్తన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి: ఏఈఓ రామకృష్ణ 

సన్న రకం వరి పండించే రైతులు విత్తన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి: ఏఈఓ రామకృష్ణ 

హన్మకొండ : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న7 రకాల సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ అందించనున్న నేపథ్యంలో, సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు తమ విత్తన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. డీలర్ వద్ద విత్తనం కొనుగోలు చేసిన రైతులు, విత్తనం కొనుగోలు వివరాలను సంబంధిత డీలర్ వద్దనే నమోదు చేయించుకోవాలని, అలాగే విత్తనం కొనుగోలు చేసిన బిల్/రశీదును తప్పనిసరిగా భద్రపరచుకోవాలని తెలిపారు.సొంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి విత్తనం తీసుకున్న రైతులు, సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈ ఓ)ను సంప్రదించి రైతు స్వీయ ప్రకటన (డిక్లరేషన్ ) సమర్పించాలని సూచించారు. స్వీయ ప్రకటనలో విత్తనం వివరాలను నమోదు చేసి, ఎ ఈవో ద్వారా సంబంధిత వివరాలను నమోదు చేయించుకోవాలని తెలిపారు.సన్న రకం వరి బోనస్ ప్రయోజనం పొందడానికి రైతుల వివరాలు, విత్తనం వివరాలు మరియు అవసరమైన డిక్లరేషన్ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని అధికారులు పేర్కొన్నారు. చివరి తేదీ: 10-09-2026. ఇప్పటికీ నమోదు చేసుకోని రైతులు వెంటనే సంబంధిత ఏ ఈ ఓ  / వ్యవసాయ అధికారిని సంప్రదించాలని, ప్రభుత్వం అందిస్తున్న బోనస్ ప్రయోజనాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

క్రమశిక్షణ, ప్రణాళికతోనే కొలువు సాధించవచ్చు క్రమశిక్షణ, ప్రణాళికతోనే కొలువు సాధించవచ్చు
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సోమవారం రోజున పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ పై అవగాహన సదస్సును కె.ఎన్.ఆర్ ఇన్స్టిట్యూట్, కరీంనగర్ వారి...
ఎమ్మార్వోను వెంబడించిన ఇద్దరు వ్యక్తులు  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించాలి: డీఎస్పీ ప్రసన్నకుమార్
కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి.
బాన్సువాడ ఆర్ డి ఓ వినతి పత్రం సమర్పించిన బి ఆర్ ఎస్ నాయకులు.
బాన్సువాడ కోటాలో బి ఆర్ ఎస్ సమరభేరి.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అంత డొల్ల