బ్లడ్ క్యాన్సర్ బాధితుడికి మాల సంఘం ఆర్థిక చేయూత
పెంటయ్య వైద్య ఖర్చులకు రూ.25 వేల ఆర్థిక సా
ఎల్లారెడ్డిపేట, :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామానికి చెందిన బండ పెంటయ్య బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో గ్రామ మాల సంఘం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చింది. పెంటయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వైద్య ఖర్చుల భారం కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో మాల సంఘం ఆధ్వర్యంలో రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు పెంటయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో తమ వంతు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సమాజం అండగా నిలవడం ఎంతో అవసరమని సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చన్నారు. పెంటయ్య త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాల సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


