ప్రజా ప్రతిభ రిపోర్టర్‌పై కౌన్సిలర్ దురుసు ప్రవర్తన..!

ప్రజా ప్రతిభ రిపోర్టర్‌పై కౌన్సిలర్ దురుసు ప్రవర్తన..!

  • వార్త డిలీట్ చేయాలంటూ బెదిరింపులు దూషణలు..!
  • మంత్రి గారు చెప్తే చేస్తాడా నువ్వెవడివి రా అంటూ విరుచుకుపడినట్లు ఆరోపణలు..!
  • పత్రిక విలువలను కించపరిచేలా వ్యాఖ్యలు ప్రాణహాని బెదిరింపులు..!
  • బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు పత్రికా సంఘాల హెచ్చరిక..!

ఖమ్మం  : ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజా ప్రతిభ రిపోర్టర్ గంధసిరి లాలయ్య గౌడ్‌పై సాయి గణేష్ నగర్ వార్డు కౌన్సిలర్ తీవ్ర దురుసు ప్రవర్తనకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి వార్తను డిలీట్ చేయాలని ఒత్తిడి చేయడమే కాకుండా నువ్వెవడివి రా నువ్వు రిపోర్టర్ అయితే ఏం పీకుతావ్ పత్రిక అయితే ఏమిటి అంటూ విలేఖరిని మరియు పత్రికను కించపరిచేలా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతటితో ఆగకుండా నీ సంగతి చూస్తా నిన్ను చంపుతా నిన్ను తొక్కుతా రేపటి నుంచి నువ్వు ఎలా తిరుగుతావో చూస్తా అంటూ బెదిరించినట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనంగా మారింది తీవ్ర అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం సాధారణ వాగ్వాదం పరిధిని దాటి పత్రికా స్వేచ్ఛపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా మారిందని పాత్రికేయ వర్గాలు మండిపడుతున్నాయి ప్రజల సమస్యలను ప్రశ్నించే విలేఖరిపై ఈ తరహా దూషణలు బెదిరింపులు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాయి గణేష్ నగర్‌లో ఇళ్లకు అత్యంత సమీపంగా ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ ప్రజలకు ప్రమాదకరంగా మారిన పరిస్థితిపై ప్రజా ప్రతిభ వరుస కథనాలను ప్రచురించింది ఇళ్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనలో స్థానికులు ఉన్న విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది రిపోర్టర్ గంధసిరి లాలయ్య గౌడ్ ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం సమస్య తీవ్రతను గుర్తించిన మంత్రి విద్యుత్ శాఖ అధికారులను స్పందించాలని ఆదేశించడంతో అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి 33 కేవీ విద్యుత్ లైన్‌ను ఇళ్లకు దూరంగా మార్చే దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది ప్రజల ప్రాణ భద్రత కోసం రాసిన వార్తకు పరిష్కారం లభించే పరిస్థితి ఏర్పడిన సమయంలోనే అదే వార్తను డిలీట్ చేయాలని విలేఖరిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు రావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది వార్తలో వాస్తవాలు లేవని భావిస్తే వివరణ ఇవ్వవచ్చు ఖండన ఇవ్వవచ్చు సంబంధిత అధికారుల ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేయవచ్చు కానీ నేరుగా విలేఖరికి ఫోన్ చేసి వార్త తొలగించాలని చెప్పడంతో పాటు వ్యక్తిగత దూషణలకు దిగడం బెదిరింపులకు పాల్పడటం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పత్రికలో వచ్చిన వార్తను ఎదుర్కొనేందుకు వాస్తవాలతో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉండగా బెదిరింపులతో వార్తను ఆపాలని చూడటం పత్రికా విలువలకు విరుద్ధమని పాత్రికేయులు పేర్కొంటున్నారు ఒక విలేఖరి వెనక్కి తగ్గితే రేపు మరో విలేఖరి ప్రజల సమస్యను రాయడానికి భయపడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి గారు చెప్తే చేస్తాడా నువ్వు చెప్తే అవుతుందా నువ్వెవడివి రా అంటూ మాట్లాడినట్లు ఆరోపణలు రావడం ఈ వ్యవహారానికి మరింత రాజకీయ రంగును తీసుకువచ్చింది ప్రజల సమస్య పరిష్కారం కోసం మంత్రి స్పందించడం అధికారులను ఆదేశించడం ప్రభుత్వ వ్యవస్థలో భాగమని అలాంటి ప్రజాప్రతినిధిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు విలేఖరిని మాత్రమే కాకుండా పత్రికను దూషించడం పత్రిక ప్రతిష్ఠను కించపరిచేలా మాట్లాడటం పాత్రికేయ వ్యవస్థను అవమానించడమేనని అంటున్నారు ప్రజా ప్రతిభ ఒక వార్తను ప్రచురించినందుకు విలేఖరిపై బెదిరింపులు రావడం పత్రికా రంగంలో ఆందోళన కలిగించే అంశంగా మారింది ప్రజల తరఫున ప్రశ్నించడం వార్తలను వెలుగులోకి తీసుకురావడం విలేఖరి బాధ్యత అని ఆ బాధ్యతను నిర్వహిస్తున్న సమయంలో బెదిరింపులకు గురిచేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పత్రికా సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు వార్తను రాయకుండా చేయడం కోసం బెదిరింపులు ఉపయోగిస్తే అది ఒక్క విలేఖరిపై ఒత్తిడి కాకుండా సమాజానికి సమాచారం అందించే వ్యవస్థపైనే ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు ఈ ఘటనను పత్రికా సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి విలేఖరిపై అసభ్య పదజాలంతో దూషణలు చేసినట్లు ప్రాణహాని కలిగించేలా బెదిరించినట్లు వార్తను డిలీట్ చేయాలని ఒత్తిడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వ్యవహారంపై రేపు పత్రికా యూనియన్ తరఫున పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయిస్తామని తెలిపారు విలేఖరులపై బెదిరింపులు దూషణలు కొనసాగితే పత్రికా సంఘాలు ఐక్యంగా స్పందిస్తాయని స్పష్టం చేశారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే కలాన్ని బెదిరింపులతో ఆపలేరని వార్త నచ్చకపోతే వాస్తవాలతో సమాధానం ఇవ్వాలే తప్ప విలేఖరిని భయపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని హెచ్చరించారు....

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వినియోగదారుల చైతన్య సదస్సు వినియోగదారుల చైతన్య సదస్సు
హన్మకొండ న్యూస్ :  విద్యార్థులు వినియోగదారుల సంఘాలలో పనిచేయడానికి ఆసక్తి చూపెట్టాలని కన్స్యూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్...
జీవో 97 రద్దు చేయాల్సిందే పాలిటెక్నిక్‌ విద్యార్థుల డిమాండ్‌
22A భూముల మహాధర్నాకు తరలివెళ్లిన బీజేపీ నాయకులు.
వినాయక చవితి ఉత్సవాలు  శాంతియుత వాతావరణం లో  నిర్వహించాలి. డీఎస్పీ విఠల్ రెడ్డి
బర్త్ డే వేడుకలతో భారీగా ట్రాఫిక్ జామ్
ఆదిలాబాద్ మున్సిపాల్టీ కి మంజూరైన నాలుగు ట్రాక్టర్లను
కుడా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి శుభాకాంక్షలు తెలిపిన కడియం శ్రీహరి