ప్రజావాణి కేంద్రాల్లో బీఆర్‌ఎస్ నిరసన
ఆరు గ్యారంటీలు.. 420 హామీల అమలుపై వినతిపత్రాలు
మహమ్మదాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలుపై బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వెయ్యి రోజుల పాలన పూర్తవుతున్నా హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మహమ్మదాబాద్ మండల ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై వినతిపత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను, ప్రభుత్వం అమలు చేయాల్సిన హామీలను వినతిపత్రా ల రూపంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల తో పాటు మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు, విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్‌మెంట్, ఉద్యోగాల భర్తీ తదితర హామీలను అమలు చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు.‘బాకీ కార్డులు’, 420 అడుగుల ఫ్లెక్సీలతో నిరసనలు చేపట్టింది. హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. సర్పంచ్ లు గాయత్రీ దేవి, మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, రఘు యాదవ్,బాల వర్ధన్ రెడ్డి, రాజు, మాజీ ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


