కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయాలి.
నసురుల్లాబాద్ ఎంఆర్‌ఓ కు బీఆర్‌ఎస్ నేతలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ భారత రాష్ట్ర సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్లను వెంటనే అమలు చేసి అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనా లు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ నేతలు సోమవారం నసురుల్లాబాద్ ఎంఆర్‌ఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీల అమలులో నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి కాలం గడుస్తున్నా అనేక హామీలు పూర్తిస్థాయి లో అమలు కాలేద ని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, తులం బంగారం, స్కూటీ వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రతి పంటకు రైతు భరోసా, పంటలకు బోనస్, నాణ్యమైన ఎరువుల కొరత లేకుండా సరఫరా, 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని కోరారు. రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం తో పాటు జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని, విద్యార్థులకు విద్యా భరోసా కల్పించి పెండింగ్ ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులకు రూ.4 వేల పింఛన్ అందించాలని, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, విద్యార్థి, యువజన, రైతు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లలోని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమం గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాల ను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించే ప్రజలు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ఆపాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. తమ కుటుంబాల్లోని అర్హులైన ప్రతి సభ్యుడి కి ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ కన్వీనర్ నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, అక్తర్, రాము, భూమయ్య, భాస్కర్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


