రైతులకు శాశ్వత  భూ సమస్య ల పరిష్కారమే ప్రభుత్వలక్ష్యం 

- తాసిల్దార్ రాళ్లబండి రాంబాబు 

రైతులకు శాశ్వత  భూ సమస్య ల పరిష్కారమే ప్రభుత్వలక్ష్యం 

మధిర మండలం తొండల గోపవరం గ్రామపంచాయతీ గ్రామాన్ని భూభారతి పోర్టల్ లో భాగంగా పైలట్ గ్రామంగా ఎన్నిక కాబడి రెవెన్యూ సర్వే కార్యక్రమం జరుగుతుండగా నేడు రెవెన్యూ గ్రామ సదస్సును స్థానిక  సర్పంచ్ షేక్ కన్నo సాహెబ్ ఆధ్వర్యంలో నిర్వహించగా మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ సభాధ్యక్షులు గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధిర తహసిల్దార్ రాళ్ల బండి రాంబాబు మండల సర్వేయర్ ఉషారాణి ఆర్ ఐ భాను మధిర మండల మాజీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మధిర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలూరి సత్యనారాయణ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కర్నాటి రామారావు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి స్థానిక రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ రాంబాబు మాట్లాడుతూ తొండల గోపవరం గ్రామ రెవిన్యూ పరిధిలో 574 ఎకరాల భూమిని గుర్తించి సరిహద్దులను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను డొంకలను గుర్తించడం జరిగిందని తదుపరి రైతులు యొక్క భూములు సరిహద్దులు నిర్ధారించి శాశ్వత భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలియజేశారు  ఈ సందర్భంగా మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్ మాట్లాడుతూ మదిర మండలంలో తొండల గోపవరం గ్రామ రెవిన్యూ ను భూభారతి పోర్టల్ లో భాగంగా పైలెట్ గ్రామంగా ఎంపిక చేసిన స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో భూభారతలో భాగంగా ఉన్న భూమి కంటే తక్కువ ఎక్కటం సర్వే నంబర్లు తప్పుగా రావడం అలాగే సరిహద్దులు విషయంలో తేడాలు ఉండటం వల్ల గత పది సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీ ప్రజలు తాసిల్దారు ఆఫీస్ చుట్టూ తిరిగిన పరిష్కారం లభించకపోవడం ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ ను తీసివేసి భూభారతి పోర్టల్ ను ప్రవేశపెట్టి  భూములన్నిటిని రీ సర్వే చేయడం శుభపరిణామని అందుకు ప్రభుత్వా నికి కృతజ్ఞతలు తెలిపారు  ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు సూర్యదేవర వెంకటేశ్వరరావు వెంకటరెడ్డి వాసిరెడ్డి రవికుమార్ వాసిరెడ్డి వెంకట్రావు నల్లమల సత్యంబాబు నల్లమల బాబురావు నల్లమల గాంధీ పారుపల్లి కోటయ్య పారుపల్లి తులసమ్మ మచ్చా అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News