మంజీర నది FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి:

తహసీల్దార్‌కు గ్రామస్తుల వినతి

మంజీర నది FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకోవాలి:

చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ చౌటకూర్ తహసీల్దార్‌కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం... చౌటకూర్ మండలం శివ్వంపేట రెవెన్యూ పరిధిలోని, గ్రామానికి ఎదురుగా ఉన్న బీరు పరిశ్రమ సమీపంలో సర్వే నంబర్ 207లో ప్రభుత్వ నక్షబాట ఉంది. అయితే, ఈ భూమిలోని కొంత భాగాన్ని వ్యాపార అవసరాల కోసం నాలా కన్వర్షన్ చేసుకుని అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు.ఈ స్థలం నేరుగా మంజీర నదికి ఆనుకుని ఉన్నందున, ఇది FTL లేదా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా అనే అంశాన్ని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల నక్షబాటను పరిరక్షిస్తూ, ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని మరియు ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రంతో పాటు అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను కూడా అధికారులకు ఆధారాలుగా అందజేశారు.
Views: 271

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఆపదలో అండగా నిలిచిన యువత ఆపదలో అండగా నిలిచిన యువత
దౌల్తాబాద్,సిద్దిపేట: మండలంలోని అప్పాయిపల్లి గ్రామానికి చెందిన డాకి కీర్తన అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కీర్తన మృతితో ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న...
ఆర్డిఓ ను కలిసిన భాజపా నాయకులు
గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
 సాలార్ నగర్ రైతులు భూ భారతి  సర్వే కోసం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత.
విశ్వకర్మ జయంతి ను ఘనంగా నిర్వహించాల
విద్యార్థుల రీడింగ్ సామర్థ్యాలను అంచనా వేయాలని,ఉపాధ్యాయులకు సూచన.
పెబ్బేరు జడ్పీహెచ్‌ఎస్‌లో మండల స్థాయి క్రీడలు ప్రారంభం