నూతన పింఛన్ల కొరకు ఇంటింటా సర్వే
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల సేకరణలో భాగంగా అధికారులు ఇంటింటా సర్వే నిర్వహించారు. డిచ్పల్లి ఎపీయం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ పరిస్థితులు, అర్హతకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి నవీన్, భాస్కర్ , రాములు అధికారులతో కలిసి సర్వే ప్రక్రియను పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు అందేలా క్షేత్రస్థాయిలో వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సర్వేకు దరఖాస్తుదారులు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


