అక్రమంగా గోవుల తరలింపు.. 8 బొలెరో వాహనాలు పట్టివేత
మిడ్జిల్‌లో అర్ధరాత్రి హిందూ వాహిని, బీజేపీ నాయకుల తనిఖీలు
మిడ్జిల్: మిడ్జిల్ మండల పరిధిలో మంగళవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా వెళ్తున్న 8 బొలెరో వాహనాలను హిందూ వాహిని, బీజేపీ నాయకులు అడ్డుకుని పట్టుకున్నారు. వాహనాల్లో గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన వారు వెంటనే మిడ్జిల్ పోలీసులకు సమాచారం అందించారు. హిందూ వాహిని, బీజేపీ నాయకుల కథనం ప్రకారం.. వాహనాల్లో గోవులను కట్టేసి అనుమానాస్పదంగా తరలిస్తుండటాన్ని గమనించి వాహనాలను అడ్డుకుని తనిఖీ చేశారు. అనంతరం వాహనాలను మిడ్జిల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు వాహనాలను, గోవులను పరిశీలించి తరలింపునకు సంబంధించిన అనుమతులు, పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా గోవులను తరలించినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనతో మిడ్జిల్ మండలంలో అర్ధరాత్రి జరిగిన గోవుల తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


