ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు వెళ్తున్న ఆదివాసీ బిడ్డలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క..

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు వెళ్తున్న ఆదివాసీ బిడ్డలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క..

హైదరాబాద్ : ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు ఈనెల 23న బయలుదేరనున్న ఆదివాసీ బిడ్డలను రాష్ట్ర మంత్రి సీతక్క అభినందించారు. సచివాలయంలో కన్నిబాయి, ఆనంద్ అడ్వెంచర్ బృందం మంత్రి సీతక్కను కలిశారు.కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మడావి కన్నిబాయి, ఆదిలాబాద్‌కు చెందిన కాత్లే ఆనంద్ రావు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ యాత్రకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వారికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. బృంద సభ్యులను ఆప్యాయంగా పలకరించి, యాత్ర విజయవంతంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమైన ఆదివాసీ బిడ్డలకు మంత్రి సీతక్క హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కోలాం, తోటి తెగలకు చెందిన మడావి కన్నిబాయి, కాథ్లే ఆనంద్ రావులను అభినందిస్తూ తన వంతుగా వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.“ఆదివాసీ బిడ్డలు కేవలం పర్వత శిఖరాలనే కాకుండా, జీవితంలోనూ ఉన్నత శిఖరాలకు ఎదగాలి” అని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. యాత్రను విజయవంతంగా పూర్తి చేసి తిరిగి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వారిని కలిపేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్లు బృంద సభ్యులు తెలిపారు.

Views: 49

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు
హుస్నాబాద్  :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున మండల న్యాయ సేవాధికారి సంస్థ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు హుస్నాబాద్...
గంభీరావుపేట్ పోలీసుల ఆధ్వర్యంలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం
తెగలే.. తేలలే..!
JAC తదుపరి కార్యాచరణపై అంతర్గత చర్చ
ఫుట్బాల్ లో జాతీయ స్థాయికి ఎంపికైన నిశ్చిత
నూతన పింఛన్ల కొరకు ఇంటింటా సర్వే
అక్రమంగా గోవుల తరలింపు.. 8 బొలెరో వాహనాలు పట్టివేత