ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రిలో విషాదం.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రిమ్స్ ఆసుపత్రిలో విషాదం.

  • ఏసీ పేలి  ఐదు రోజుల శిశువు మృతి...
  • ఆందోళనకరంగా మరో 24మంది చిన్నారుల పరిస్థితి..!

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని రాజీవ్ గాంధీ మెడికల్ ఆసుపత్రి లో అర్దరాత్రి శిశివుల వార్డులో విషాదం జరిగింగి. ఆ సమయం లో శిశువుల వార్డులో 27 మంది చికిత్స పొందుతున్నారు. వార్డులో రోగుల కొరకు ఏర్పాటు చేసిన ఏసీ ఆకస్మాత్తుగా పేలి పోవడంతో వార్డు మొత్తం పొగలతో నిండిపోవడం జరిగింది. దీంతో అక్కడ చికిత్స పొందుతున్న పసి పిల్లలతో పాటు వారి దగ్గర ఉన్న అటెండెన్స్ కూడా తీవ్ర అస్వస్థత కు గురైయ్యారు. వార్డు మొత్తం పొగతో నిండి పోవడంతో వార్డులో ఉన్నవారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వార్డులో పొగతో ఊపిరాడక అక్కడిక్కడే ఐదు రోజుల  ఓ శిశువు మృతిచెందింది. వార్డులో చికిత్స పొందుతున్న మరో శిశువు జాడ తెలియడం లేదు. ఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, వివిధ శాఖల  అధికారులు చేరుకొని బాధితులను మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నలుగురు చిన్నారులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

ఘటనపై అధికారుల నిర్లక్షం.....

వార్డులో ఏర్పాటు చేసిన ఏసీ పై నియంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఘటన జరిగినట్లు పోషకులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా అధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక ఘటనలు జరిగాయి. ఏది ఏమైనా చిన్నారులు త్వరగా కోలుకోవాలని పోషకులు కోరుతున్నారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుస్నాబాద్ లో న్యాయ విజ్ఞాన సదస్సు
హుస్నాబాద్  :  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం రోజున మండల న్యాయ సేవాధికారి సంస్థ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు హుస్నాబాద్...
గంభీరావుపేట్ పోలీసుల ఆధ్వర్యంలో 60 గ్రాముల గంజాయి స్వాధీనం
తెగలే.. తేలలే..!
JAC తదుపరి కార్యాచరణపై అంతర్గత చర్చ
ఫుట్బాల్ లో జాతీయ స్థాయికి ఎంపికైన నిశ్చిత
నూతన పింఛన్ల కొరకు ఇంటింటా సర్వే
అక్రమంగా గోవుల తరలింపు.. 8 బొలెరో వాహనాలు పట్టివేత