ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇప్పించండి

బిజినపల్లి ఎస్సైకి వినతిపత్రం ఇచ్చిన తల్లిదండ్రులు, విద్యార్థి

జిల్లా నాగర్ కర్నూల్   మండలంలోని మంగనూర్ (గారం) గ్రామానికి చెందిన నాగవుల స్వామి s/o బాల్రాజ్ కుమార్తె 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో 2022-23లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ సీటు సాధించి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందింది.అడ్మిషన్ సమయంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తండ్రి తెలిపారు. గతంలో సర్టిఫికేట్ కోసం ప్రయత్నించినప్పుడు చిన్న పొరపాటు జరిగిందన్నారు. తన కుమార్తెకు 08-09-2026 నుండి 15-09-2026 గడువులోగా మైగ్రేషన్ సర్టిఫికేట్ వచ్చేలా చూడాలని కోరుతూ సోమవారం బిజినపల్లి ఎస్సైకి వినతిపత్రం అందజేశారు.వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News