స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలి
- దళిత స్పీకర్‌ను అవమానించడం తాతా మధు అహంకారానికి పరాకాష్ట
- బీఆర్‌ఎస్ నేతల నోటి దురుసుకు ప్రజలే సమాధానం చెబుతారు
మధిర: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సభా గౌరవాన్ని, రాజ్యాంగబద్ధమైన పదవిని అవమానించేలా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ రావు పై ఇంతటి నోటి దురుసుతో మాట్లాడటం తాతా మధు అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు. దళితుల ఆత్మగౌరవాన్ని గౌరవించకుండా అవమానకరంగా మాట్లాడే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.తాతా మధూ..దళిత నాయకుడి పై నోరు పారేసుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. స్పీకర్ పదవిని అవమానించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. శాసనసభ గౌరవాన్ని కాపాడేందుకు వెంటనే సస్పెండ్ చేయాలి” అని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినా అహంకారం మాత్రం ఇంకా పోలేదని, పదవి పోయిన బాధతో రాజ్యాంగబద్ధమైన పదవులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పే వరకు తాతా మధు ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాతా మధు పై కఠిన చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. స్పీకర్ గౌరవం అంటే రాజ్యాంగ గౌరవం.. దళితుల ఆత్మగౌరవం అంటే తెలంగాణ ఆత్మగౌరవం. దానిని అవమానించే తాతా మధు ను వెంటనే సస్పెండ్ చేయాల్సిందే! అని కాంగ్రెస్ నాయకులు నినదించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పారుపల్లి విజయకుమార్ మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూరంశెట్టి కిషోర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు జిల్లా సెక్రటరీ పులిబండ్ల చిట్టిబాబు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తుమాటి నవీన్ రెడ్డి, కౌన్సిలర్లు బాణావత్ వెంకటరమణ నాయక్ బెజ్జం రాజు, దార నాగార్జున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటిబండ్ల సత్యంబాబు దేవి శెట్టి రంగారావు మువ్వ వెంకయ్య బాబు పత్తిపరపు సంగయ్య సామినేని రామనాథం బిట్రా ఉద్దండయ్యా ఆదూరి శీను మోదుగు బాబు యూత్ కాంగ్రెస్ నాయకులు సాలిక సురేష్ గద్దల రాజా, గౌసుద్దీన్ మరియు వివిధ హోదాలలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


