బిజినపల్లి బీజేపీ నేతల అక్రమ అరెస్టులు సహించం

 కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం

బిజినపల్లి బీజేపీ నేతల అక్రమ అరెస్టులు సహించం



నాగర్ కర్నూల్ , బిజినపల్లి, :  "ఫీజుల బకాయి - బీజేపీ లడాయి" పేరుతో బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆదివారం బిజినపల్లి మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి బిజినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే, అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
అరెస్ట్ అయిన వారిలో...
రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా మాజీ కార్యవర్గ సభ్యులు మల్లె కె.డి. లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, బూత్ అధ్యక్షులు నరసింహ, పవన్, బాలకృష్ణ, పరమేష్, తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

Views: 220

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News