అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

గజ్వేల్/సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్న పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లి పాలు అమృతం లాంటివని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలల పాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని, ఇది బిడ్డకు కొండంత రక్షణను, వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుందని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నాగమణి, ఆయా అనసూయ, వార్డు నాయకులు, మహిళలు, పిల్లల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 
Views: 62

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News