ఆంధ్ర గడ్డపై తెలంగాణ సత్తా
- జాతీయ కరాటేలో నాగర్ కర్నూల్ క్రీడాకారుల పతకాల పంట!
- 2 గోల్డ్, 4 సిల్వర్, 7 బ్రౌన్జ్ మెడల్స్ కైవసం
- డబుల్ ప్రమోషన్ సాధించిన విద్యార్థులు
జిల్లా నాగర్ కర్నూల్ :మండలం బిజినపల్లి/తిమ్మాజిపేట, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 13వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం సాయిపల్లి గ్రామం మరియు తిమ్మాజిపేట మండలం నుండి ముగ్గురు క్రీడాకారులు ఈ జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో మన జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి రెండు గోల్డ్ మెడల్స్, నాలుగు సిల్వర్ మెడల్స్ మరియు ఏడు బ్రౌన్జ్ మెడల్స్ ను షోటోకాన్ ఆర్ట్ విభాగం నుండి సాధించి జిల్లాకు ఘన కీర్తి తెచ్చారు. అంతేకాకుండా కుంతీ మరియు కట్టా మూమెంట్ విభాగంలో డబుల్ ప్రమోషన్ కూడా సాధించారని మాస్టర్ సెన్సాయ్ జగన్ మాస్టర్ తెలియజేశారు. ఈ విజయం వెనుక విద్యార్థుల కఠోర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు ఉపాధ్యాయుల కృషి ఉందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన విద్యార్థులను పలువురు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


