ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల

బెల్లంపల్లి మంచిర్యాల :ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేన్నెల మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కరపత్రాలను ఆవిష్కరించగా, అనంతరం స్థానిక పోలీసు సిబ్బంది చేతుల మీదుగా కూడా కరపత్రాలను విడుదల చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలను విజయ వంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు కొద్దని మల్లేష్, మహిళా మండల అధ్యక్షురాలు ఎరిగేటి లక్ష్మి, విద్యార్థి సంఘం కోశాధికారి గొలిశెట్టి అజయ్, గొలిశెట్టి భీమేష్, శ్రీకాంత్, అశోక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget