నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు
- 7 మంది అరెస్ట్ రూ. 68 వేల నకిలీ నోట్లు స్వాధీనం
- నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ వెల్లడి.
నాగర్ కర్నూల్ బిజినపల్లి,: నకిలీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న అంతర్‌జిల్లా ముఠాను బిజినపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మందిని పట్టుకోగా, వారి వద్ద నుంచి రూ. 68,000 విలువైన నకిలీ ₹500 నోట్లు, ప్రింటింగ్ యంత్రాలు, ప్రత్యేక కాగితాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎలా వెలుగులోకి వచ్చింది?
గత నెల 1న మంగానూరు గ్రామంలోని కనకదుర్గ వైన్స్‌లో ఓ వ్యక్తి రెండు ₹500 నకిలీ నోట్లు ఇచ్చి బీర్లు కొన్నాడు. క్యాషియర్ కౌంటింగ్ మిషన్‌లో వేయగా అవి నకిలీవని తేలింది. వైన్స్ నిర్వాహకుడు రాగి స్వామి ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేడు నాగర్‌కర్నూల్ సీఐ వై. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మంగానూరులోని బొల్ల కురుమూర్తి ఇంటిపై దాడి చేయగా, అక్కడ 7 మంది కలిసి నకిలీ ₹500 నోట్లను ముద్రిస్తూ దొరికిపోయారు.
ముఠా పనితీరు*
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ1 కలిదిండి నాగరాజు ఈ పనికి పాల్పడ్డాడు. ఏ2, ఏ3, ఏ4, ఏ7లతో కలిసి కలర్ జిరాక్స్ మిషన్ ద్వారా రూ. 2 లక్షల విలువైన నకిలీ నోట్లను ముద్రించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఏ5 నవీన్ గౌడ్‌తో ఏ2 ఒప్పందం కుదుర్చుకున్నాడు. ₹1,000 అసలు డబ్బుకు ₹4,000 నకిలీ నోట్లు ఇచ్చేవారు. దీని ప్రకారం ఏ5 ₹20,000 ఇచ్చి ₹80,000 నకిలీ నోట్లు తీసుకున్నాడు. వాటిని ఏ6, ఏ8లకు పంచగా, ఏ6 వాటిని స్థానిక డాబాలు, కిరాణా షాపులు, పెట్రోల్ బంకుల్లో చలామణి చేసేవాడు.
*నిందితుల వివరాలు*
1. *ఏ1*: కలిదిండి నాగరాజు (44), మీసేవా కౌంటర్, సిద్ధాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఏపీ
2. *ఏ2*: ముదుండి శివ వెంకట ధర్మరాజు (37), ఆక్వా టెక్నీషియన్, కలువపూడి, పశ్చిమ గోదావరి, ఏపీ
3. *ఏ3*: లక్కోజు అశోక్ కుమార్ (32), వీడియో ఎడిటర్, సిద్ధాపురం, ఏపీ
4. *ఏ4*: బొమ్మగంటి ఎల్.ఎన్. సతీష్ కుమార్ (38), హోటల్ వ్యాపారం, తడికలపూడి, ఏలూరు, ఏపీ
5. *ఏ5*: వంగా నవీన్ గౌడ్ (27), వ్యవసాయం, మంగానూర్, నాగర్‌కర్నూల్, తెలంగాణ
6. *ఏ6*: బొల్ల కురుమూర్తి (27), వ్యవసాయం, మంగానూర్, నాగర్‌కర్నూల్, తెలంగాణ
7. *ఏ7*: అడపా పృధ్వీరాజ్ (33), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, చింతలపూడి, ఏలూరు, ఏపీ
8. *ఏ8*: జయమంగళ సత్యనారాయణ (34), కైకలూరు, కృష్ణా జిల్లా, ఏపీ - _పరారీలో
స్వాధీనం
- రూ. 68,000 విలువైన నకిలీ ₹500 నోట్లు
- 7 సెల్ ఫోన్లు
- 1 HP కలర్ జిరాక్స్ మిషన్, 1 కౌంటింగ్ మిషన్, కాటన్ లినెన్ పేపర్లు, ప్రింట్ చేసిన నకిలీ పేపర్లు.ఈ కేసును ఛేదించిన సీఐ వై. అశోక్ రెడ్డి, ఎస్ఐ ఎస్.కె. శంషొద్దీన్, సిబ్బంది భీముడు, ప్రవీణ్, రమేష్, శివలను నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ అభినందించారు.
ప్రజలకు విజ్ఞప్తి
అనుమానాస్పదంగా కనిపించే నోట్లను స్వీకరించవద్దు. నకిలీ కరెన్సీ తయారీ లేదా చలామణి గురించి సమాచారం ఉంటే వెంటనే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు.
Views: 155
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
07 Aug 2026 18:17:29
చౌటకూర్, :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం పరిధిలోని మంజీర నది పక్కన ఉన్న నక్షబాట (రైతుల దారి) మరియు FTL (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలో జరుగుతున్న...
